Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలింది. అల్లు అర్జున్ పై ఓ వ్యక్తి హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే సంధ్య థియేటర్ తొక్కిసలాటపై యుగేందర్ గౌడ్ అనే వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఒక సినిమా వలన ఒకరి ప్రాణం పోయింది.. ఇంకో పసి ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు రావద్దు అని చెప్పినా.. అల్లు అర్జున్ రావడంవలనే ఆమె ప్రాణం పోయింది.
అందుకే వారిని వదిలేది లేదు.పుష్ప 2 చిత్ర బృందంతో పాటు అల్లు అర్జున్ పై కూడా చర్యలు తీసుకోవాలని యుగేందర్ ఫిర్యాదులో తెలిపాడు. ప్రచారమోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారు. వారిని ఊరికే వదలకూడదు. నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం బలి అయ్యిందని యుగేందర్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటివరకు లోకల్ పంచాయితీని ఎదుర్కున్న బన్నీ ఈ ఢిల్లీ పంచాయితీని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా, ఈ కేసులో అల్లు అర్జున్ ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఒకరోజు పాటు జైల్లో గెలిచిన అల్లు అర్జున్ మరుసటి రోజు రోజు బెయిల్ పై విడుదలయ్యాడు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన లాయర్ లాజిక్ తో మాట్లాడి ఆయనకు పుష్ప కు బెయిల్ తెప్పించాడు. మరి హ్యూమన్ రైట్స్ కేసును ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.