Jammalamadugu: జమ్మలమడుగు ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి కీలక నియోజకవర్గం… ఇక్కడ పార్టీ అభ్యర్థి కంటే వైఎస్ బ్రాండ్‌తో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. పార్టీ ఏర్పాటు తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణ రెడ్డి తర్వాత టీడీపీ గూటికి చేరి మంత్రి పదవి కొట్టేశారు. 2019లో మూలె సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకోలేని దెబ్బ వైసీపీ తగిలింది. జగన్‌కు సొంత జిల్లాలోను ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. పులివెందులలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉన్నా… కానీ జమ్మలమడుగులో పార్టీ ఓడిపోవడంపై వైసీపీ నేతల్లో పెద్ద చర్చ జరిగింది.
అయితే ఇదంతా పక్కన పెడితే పార్టీలో ఇప్పుడు జరుగుతున్న అంతర్గత విభేదాలు జగన్‌కు తలనొప్పిగా మారిందట.నియోజకవర్గ ఇన్చార్జి పదవి కోసం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన మూలె సుధీర్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించకుండా పోవడంతో జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పెద్ద దిక్కు అయ్యారట…అయితే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కోసం పట్టుబట్టారట.ఇటీవల వైసీపీ అధినేత జగన్ వద్దే పంచాయితీ జరిగినా మళ్ళీ గుర్రుగా ఉన్నారట.
ఇది కూడా చదవండి: Mahaa Vamsi: అర్ధరాత్రి “షేర్లు” .. పోర్ట్ నే నొక్కేశారు
Jammalamadugu: అసలే అధికార పార్టీ వేధింపులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు సొంత జిల్లాలో జగన్‌కు మరో తలనొప్పిగా మారిందట… గత నెలలో ఇడుపులపాయలో ఇద్దరు నేతలతో కలిసి చర్చించి జమ్మలమడుగు నియోజకవర్గం చెరి సగం మండలాలు కేటాయించి పని చేసుకోవాలని సూచించప్పటికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాత్రం నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి క్యాడర్ కాపేడేందుకు అండగా ఉంటు నిత్యం ప్రజల్లో ఉంటున్నారట… పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పినా సుధీర్ రెడ్డి మాత్రం నియోజకవర్గ కార్యకర్తలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారిందట.ఇద్దరు నేతలను జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పిలిచి మాట్లాడినా సమస్య కొలిక్కి రాకపోవడంతో మరోసారి అధినేత రంగంలోకి దిగక తప్పదు అంటున్నారు వైసీపీ క్యాడర్… మరీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.