Coimbatore

Coimbatore: కోయంబత్తూరులో చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత : చిన్నారి కోసం డ్రోన్లతో గాలింపు

Coimbatore: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుతపులి బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా వాల్‌పారై అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో చిరుత సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. శనివారం ఈ చిరుత ఒక చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. రోషిణి అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా, చిరుతపులి ఆమెను తీసుకెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అంతేకాకుండా, అదే చిరుతపులి టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న నలుగురు కూలీలపై కూడా దాడి చేసింది. ఈ వరుస ఘటనలతో స్థానికులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి రోషిణి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో రూ.500 కోట్ల భారీ స్కాం 

Coimbatore: గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. రెండు రోజుల క్రితం కూడా చిరుత గొర్రెల మందపై దాడి చేసి గాయపరిచిందని వారు చెబుతున్నారు. అప్పటి నుంచే అటవీశాఖకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. చిరుత ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, బయట ఒంటరిగా తిరగవద్దని సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *