Cognizant: ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి శుభవార్త! ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్, విశాఖపట్నంలో భారీ నూతన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్యాంపస్ ద్వారా దాదాపు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ స్వయంగా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక క్యాంపస్‌ను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కాగ్నిజెంట్ తదుపరి ముఖ్యమైన గమ్యం విశాఖపట్నమే అని రవికుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కొత్త క్యాంపస్ 2026 నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి కీలక రంగాలలో ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి.
Also Read: Indian Passport: ఈ పది దేశాలకు వీసా అక్కర్లేదు… ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే ఎంజాయ్ చేయవచ్చు!
Cognizant: కంపెనీ విస్తరణకు పూర్తి మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు కాగ్నిజెంట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్యాంపస్ ఏర్పాటుతో విశాఖపట్నం ఐటీ రంగంలో మరింత ముందుకు దూసుకుపోతుందని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Our next stop is Visakhapatnam, Andhra Pradesh where we are building a 22 acre @Cognizant campus to tap into the extraordinary talent pool in the State of AP, India. Thanks to @naralokesh and @ncbn for their leadership and for partnering with us on this expansion. https://t.co/vElFUfll8o
— Ravi Kumar S (@imravikumars) June 25, 2025