Cockfighting auction: అవి ఆషామాషీవి కాదు.. పందెం కోళ్లు.. పందెంరాయుళ్లు మంచి సరుకులు పెట్టి మేపి పెంచిన కోళ్లు.. మరి మామూలుగా ఉంటదా? పందెంలో రాటుదేలిన కోళ్లవి. నజరానాలు తెచ్చిపెట్టినవి. మరి అలాంటి కండలు తిరిగిన కోళ్లంటే యమ గిరాకీ ఉండనే ఉంటది. అందుకే పలువురు లక్షలు పోసి కొనుక్కున్నారు.
Cockfighting auction: హైదరాబాద్ సమీపంలో ఈ నెల 12న మొయినాబాద్ తోల్‌కట్టలోని ఓ ఫామ్‌హౌజ్‌లో కోడి పందాలు నిర్వహిస్తూ 64 మంది పట్టుబడగా, 85 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కోడి పందాల కేసు అనంతరం వాటిలో ఒక కోడి మృతిచెందింది. మిగతా వాటిని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టుకు పోలీసులు సమర్పించారు.
Cockfighting auction: మరి ఆ కోళ్లకు వేలకు వేలు పోసి మేపాలంటే కోర్టు తరం కానట్టుంది. అందుకే వాటికి వేలం వేసి అమ్మేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా వేలం పాట నిర్వహించింది. ఈ వేలంపాటలో పలువురు పందెరాయుళ్లు పాల్గొనేందుకు తరలివచ్చారు. రాజమండ్రి, ఏలూరు, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి వారంతా వచ్చారు.
Cockfighting auction: మరో విషయమేమిటంటే ఇదే కేసులో నిందితుల అనుచరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నట్టు సమాచారం. ఈ వేలంపాటలో 84 కోళ్లకు రూ.16.65 లక్షలకు ధర పలికింది. ఇంత భారీ స్థాయి ధరలతో కోళ్లు అమ్ముడుపోవడం విశేషం. ఊహించని రీతిలో పందెంకోళ్లకు ధర పలికిందని పలువురు పేర్కొంటున్నారు.