Yogi Adityanath

Yogi Adityanath: ప్రధాని మోదీని కలిసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్.. కారణం ఇదే..

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం, మోడీ, యోగి మధ్యఒక గంట పాటు సమావేశం కొనసాగింది. . ఈ సందర్భంగా యూపీలో మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

దీనితో పాటు, మహాకుంభ్ విజయవంతమైన నిర్వహణ గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రధానమంత్రి ఫిబ్రవరి 5న మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు. 32 రోజుల తర్వాత వారిద్దరూ మళ్ళీ కలిశారు. నిన్న సీఎం యోగి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.

ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రెజెంటేషన్‌కు ఎందుకు వెళ్లలేదు?: పీసీబీ తీరుపై అక్తర్‌ ఆగ్రహం

ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధ్యక్షుడి పరిస్థితి స్పష్టంగా లేదు. 2026 పంచాయతీ ఎన్నికలు, 2027 అసెంబ్లీ ఎన్నికల కుల సమీకరణం ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని కేంద్ర నాయకత్వం కోరుకుంటోంది. యోగి – రాష్ట్ర ప్రభుత్వంతో బాగా సమన్వయం చేసుకోగల వ్యక్తిని నియమించాలని అగ్ర నాయకత్వం కోరుకుంటోంది.

యూపీలో 2027 ఎన్నికలకు ముందు యోగి మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం 6 క్యాబినెట్ పదవులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి మరియు ఇతర ఎమ్మెల్యేలు తిరిగి మంత్రివర్గంలోకి రానున్నారు. ఈ అంశాలపై యోగి, మోడీ మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *