CM Revanthreddy:రేషన్‌కార్డులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఈ రోజు (మార్చి 30) ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని రేషన్‌కార్డులదారులు అందరికీ ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున ఈ బియ్యాన్ని అందజేయనున్నారు.
CM Revanthreddy:ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి షెడ్యూల్ కూడా ఖరారు అయింది. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో సీఎం బయలుదేరి వెళ్తారు. తొలుత హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద దిగి అక్కడ నిర్మాణంలో ఉన్న 2,000 సింగిల్ బెడ్‌రూం ఇండ్లను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 6.15 గంటలకు హుజూర్‌నగర్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో వారు పాల్గొంటారు. ఈ సందర్భంగానే వేదికపై నుంచి సన్నబియ్యం పింపిణీని ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు.