CM Revanth Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌సహా బీఆరెస్ నేతలు, మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్‌రావులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబానిది దోపిడీ చరిత్ర అని ఘాటుగా విమర్శించారు. హైడ్రా అనగానే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల బయటకు వచ్చారని తెలిపారు. బుల్డోజర్లు సిద్ధం చేశాం.. ఎవరొస్తారో రండి అని రేవంత్‌రెడ్డి చాలెంజ్ విసిరారు.
CM Revanth Reddy: ఫామ్‌హౌస్‌లపై బుల్డోజర్లు వస్తాయనే భయంతోనే కేటీఆర్, హరీశ్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. వాళ్ల తాపత్రయమంతా ఆ ఫామ్‌హౌస్‌లను కాపాడుకోవడానికే అని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు, హైడ్రా వేరు అని చెప్పారు. హైదరాబాద్ ఇమేజిని దెబ్బతీయాలని, తెలంగాణ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని విమర్శించారు. తన ఇంటికొచ్చి చేతులు కట్టుకున్న రోజులు మరిచిపోయా.. హరీశ్‌రావూ.. అంటూ రేవంత్ ప్రశ్నించారు.