CM Revanth Reddy:10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్త జ్వాలపై రాష్ట్ర పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారు. ఎమ్మెల్సీ, ఇతర స్థానిక సంస్థల వేళ ఇలాంటి అసమ్మతి పార్టీకి చెడ్డపేరు వస్తుందనే సంకేతాలతో ఆ పార్టీ అప్రమత్తమైంది. దీంతో మొగ్గలోనే తుంచేసే పనిలో పడింది. అసలు ఆ అసమ్మతి ఎందుకు వచ్చింది. ఎవరి నుంచి వచ్చింది.. అన్న విషయాలపై కూలంకశంగా చర్చించి యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.
CM Revanth Reddy:ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో ప్రత్యేక భేటీకి సమాయత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో మంత్రులు, కీలక నేతల భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ మేరకు ఎమ్మెల్యేల అసమ్మతికి కారణమైన ఆ క్యాబినెట్ మంత్రి కూడా ఈ భేటీలో పాల్గొంటున్నట్టు తెలిసింది. తన కార్యక్రమాలను రద్దు చేసుకొని మరీ ఈ భేటీకి హాజరవుతున్నట్టు తెలిసింది.
CM Revanth Reddy:ఈ అత్యవసర సమావేశానికి అధికారులు ఎవరూ హాజరుకావద్దని హుకుం జారీ అయినట్టు సమాచారం. ఫాంహౌజ్‌లో హాజరైన ఆ ఎమ్మెల్యేలనూ రప్పిస్తున్నట్టు తెలిసింది. వారి నుంచి సమాచారం తెలుసుకొని, ఈ సమావేశంలోనే దానిపై సీరియస్‌గా చర్చించి, పరిష్కరించే అవకాశం ఉన్నది. దీనిపై పార్టీ అధిష్టానానికి కూడా సమాచారం వెళ్లిందని గుసగుసలు.