CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనానికి, గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ఫేజ్-1కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్‌రెడ్డి ఆదివారం (సెప్టెంబర్ 28) శంకుస్థాపన చేశారు. తన మార్కు ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టితో ఫ్యూచర్ సిటీ కోసం రూపకల్పన చేశారు.
CM Revanth Reddy: హైదరాబాద్ నగరానికి రిలీఫ్ కల్పిస్తూ.. ప్రపంచస్థాయి ఆర్థిక, నివాస కేంద్రంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మించాలనేదే ప్రభుత్వం సంకల్పం అని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కాలుష్య రహితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు.
CM Revanth Reddy: భవిష్యత్తు తరాలకు సిద్ధమైన నగరంగా ఇది నిలదొక్కుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కీలకమైనదని వెల్లడించారు. ఇది భారతదేశంలోనే మొదటి నెట్ -జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అవతరలించనున్నదని తెలిపారు.
CM Revanth Reddy: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఈ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌కు నాలుగో నగరంగా రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. ముచ్చర్ల, మీర్‌ఖాన్‌పేట ప్రాంతాల్లో, శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవేల మధ్య 30,000 ఎకరాల్లో మొదటి ఫేజ్ విస్తరిస్తుందని వివరించారు. దీని మొత్తం విస్తీర్ణం 765 చదరపు కిలోమీర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ ఫ్యూచర్ సిటీ 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలకు విస్తరిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.