Revanth Reddy: రేపు వరంగల్ లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ లో పాలుగొనున్నారు. బహిరంగ సభకు ముందే ఓరుగల్లుపై వరాలు కురిపిస్తున్నారు. మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలిగిన ఆటంకాలు భూసేకరణకు 205 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. కుడా(KUDA) మాస్టర్ ప్లాన్ కు ఆమోదం వరంగల్ సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని విజన్ 2041కు ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది. గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ టవర్ల నిర్మాణానికి రూ.32.50 లక్షల నిధులు మంజూరు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పొడిగింపు 8.30కి.మీ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.80 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: Saudi Arabia: ఉరి శిక్షల్లో సౌదీ అరేబియా రికార్డ్.. 100 మందికి పైగా విదేశీ పౌరులకు శిక్ష!