Revanth Reddy: దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఆర్థిక నేరాల విచారణ సంస్థ (ED) మరో కీలక పరిణామాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 9న ఢిల్లీలోని కోర్టులో దాఖలైన ఛార్జిషీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించబడి ఉంది.
Revanth Reddy: ఈడీ వివరాల ప్రకారం, 2019-2022 మధ్యకాలంలో కాంగ్రెస్ నేతలు యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు విరాళాలు సేకరించేందుకు కొంతమందిపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ కూడా ఉన్నారు.
Revanth Reddy: చార్జిషీట్‌లో ఈ విరాళాలు చట్టపరమైన మార్గాల్లో సేకరించలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం పలు ఆశలు చూపడం, భయాలు పెట్టడం ద్వారా విరాళాలు సమీకరించారని ఈడీ అభిప్రాయపడింది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించినా ఆయనను నేరుగా నిందితుడిగా పేర్కొలేదని స్పష్టం చేసింది.
Revanth Reddy: ఈ కేసులో ఏ1గా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏ2గా రాహుల్ గాంధీని పేర్కొంది. ఈడీ అనుసరించిన వివరాల ప్రకారం, సోనియా, రాహుల్ మెజారిటీ షేర్లు కలిగి ఉన్న ‘యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ద్వారా రూ.2,000 కోట్ల విలువైన AJL ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించింది.
Revanth Reddy: ఈడీ దర్యాప్తు ప్రకారం, విరాళాల పేరుతో పలు హామీలు ఇచ్చినట్టు ఆధారాలు లభించాయి. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్, గుజరాత్‌కు చెందిన అరవింద్ చౌహాన్ వంటి వారు వారి వాంగ్మూలాల్లో ఈ విషయాలు పేర్కొన్నారు. పదవులు, టికెట్లు ఆశ చూపి డబ్బులు తీసుకున్నట్టు వారు ఆరోపించారు. గంభీర్ అయితే నేరుగా సోనియా గాంధీకి లేఖ రాసినట్టు వివరాలు బయటపడ్డాయి.
Revanth Reddy: ఇప్పటికే ఈ కేసులో 2023 నవంబరులో రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఈడీ, ప్రస్తుతం కేసును పీఎంఎల్‌ఏ చట్టం కింద ముందుకు తీసుకెళ్తోంది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే దోషులకు పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
Revanth Reddy: చార్జిషీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరొచ్చినప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇదే పరిస్థితి ఇతర నేతలకూ వర్తిస్తుంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు ముదురుతున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.