CM Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సభల్లో పాల్గొనే కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. అమెరికాలోనే ఉన్న ముఖ్యమంత్రి.. తెలంగాణకు చేరుకోగానే ఆయన ఎన్నికల సభల్లో వరుసగా పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరిగే సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.
CM Revanth Reddy:ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల సభ మిర్యాలగూడ పట్టణంలో జరుగుతుంది. ఇదే నెల 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగి, 8న ఉమ్మడి వరంగల్ జిల్లా సభ భూపాలపల్లిలో, 9న మెదక్‌లో నిర్వహించి ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.
CM Revanth Reddy:ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ఆయన ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. ఇక ముందు చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించనున్నారు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీల వైఖరులను ఆయన ప్రజల ముందుంచనున్నారు.
