CM Revanth Reddy: తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, నర్సంపేట, హుస్నాబాద్‌లో ఆయన పర్యటించారు. వందలాది నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆయా చోట్ల భారీ బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ రోజు (డిసెంబర్ 6) నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, స్థానిక ఎమ్మెల్యే బాలూనాయక్ ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇదే రోజు దేవరకొండ పట్టణంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి దేవరకొండ పర్యటనలో భాగంగా రూ.6.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో రూ.2 కోట్లతో స్టేడియం, వాకింగ్ ట్రాక్, బీఎన్ఆర్ కాలనీలో రూ.2 కోట్లతో పార్కు, రూ.2.50 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు ఉన్నాయి. అదే సభలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేస్తారు.
CM Revanth Reddy: ఇదే రోజు సాయంత్రం దేవరకొండ పట్టణ శివారు ప్రాంతంలోని శేరిపల్లి వద్ద ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.
