CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా ఇప్పటికే వివిధ దేశాలు చుట్టేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల (ఏప్రిల్) 15 నుంచి జపాన్‌లో పర్యటించనున్నారు. ఇదేనెలలో 23 వరకు ఆయన అక్కడే పర్యటిస్తారు. గత నెలలోనే ముఖ్యమంత్రి జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి 9 రోజులపాటు జపాన్ దేశంలోనే ఉండనున్నారు.
CM Revanth Reddy: తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం కోసం సీఎం రేవంత్‌రెడ్డి జపాన్‌లో పర్యటించనున్నారు. జపాన్ కంపెనీలు, అక్కడి పెట్టుబడిదారులతో సంబంధాలు, సాంకేతిక ఆవిష్కరణల గురించి సమాచార సేకరణకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని అధికార వర్గాల సమాచారం. ఇదే పర్యటనలో భాగంగా సీఎం ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో-2025లో పాల్గొననున్నారు.
CM Revanth Reddy: జపాన్‌లో కాన్సాయ్ నగరంలో ఏప్రిల్ 13న ప్రారంభమయ్యే ఈ ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో-2025 ఆరు నెలలపాటు కొనసాగుతుంది. ఇది అంతర్జాతీయ ఎక్స్‌పోలలో ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా అత్యత్తమ దేశాలు, ప్రతినిధులు పాల్గొంటారు.
CM Revanth Reddy: ఈసారి ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో-2025 మన జీవితాల కోసం భవిష్యత్తు సమాజాన్ని రూపొందించడం.. అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఇది ఒక భవిష్యత్తు సమావేశంగా నిర్వాహకులు చిత్రీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులు, నాయకులను ఒకచోట చేర్చి మానవాళి సమస్యలకు పరిష్కార మార్గాలను అందిస్తుంది. ఈ సదస్సు ప్రతి ఐదేండ్లకు ఒకసారి జరుగుతుంది.