CM Revanth Reddy

CM Revanth Reddy: తిరుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రేపు వైకుంఠ ద్వార దర్శనం!

CM Revanth Reddy: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం తిరుమలకు చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుని, అక్కడి నుంచి తిరుమల పద్మావతి అతిథి గృహానికి వెళ్తారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Also Read: Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో తెలుసా?

రేవంత్ రెడ్డితో పాటు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహా సుమారు 80 మంది ప్రముఖులు స్వామివారిని దర్శించుకోనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ రాత్రి నుంచే ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభం కానుండగా, రేపు ఉదయం స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *