cm revanth reddy: రాజీపడేది లేదు పోరాటం కొనసాగుతుంది

cm revanth reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి హక్కులను కాపాడటంలో రాజీపడేది లేదని, సాంకేతికంగా, రాజకీయంగా, న్యాయపరంగా ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజాభవన్‌లో ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో నీటిపారుదల శాఖను పదేళ్ల పాటు చూసిన కేసీఆర్, హరీశ్ రావు రాష్ట్రానికి తీరని నష్టం చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. 3,000 టీఎంసీలు మిగులు నీరు ఉందని చెబుతూ కేసీఆర్ చేసిన వాదనలను అవినీతిగా పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో ఏపీకి 811 టీఎంసీలు కేటాయించడం, అందులో తెలంగాణకు 299 మాత్రమే రావడం 2015లో జరిగిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయని అన్నారు. ఈ సంతకాలు మన హక్కులను ఏపీకి బహిరంగంగా ఇచ్చేశాయని ఆరోపించారు.

రాయలసీమకు 400 టీఎంసీలు తరలించేందుకు 2016లో కేసీఆర్, చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయని, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రాజెక్టుల గురించి కేసీఆర్, హరీశ్ రావు మాటలేదని పేర్కొన్నారు. కానీ జగన్‌కు పిన్నగా చంద్రబాబు వచ్చాక జలాల సెంటిమెంట్ పెంచడం అనుచితమని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబం అబద్ధాల మీదనే జీవిస్తోందని, 2023లో బీఆర్ఎస్ అధికారంలోనుండి బయటపడింది, 2024 ఎన్నికల్లో కూడా అభ్యర్థులు దొరకడం లేదని చెప్పారు. నీటిని రాజకీయాల్లో ఉపయోగించి పార్టీ బతకడం లక్ష్యమని విమర్శించారు. అలాగే, సెంటిమెంట్ పుట్టించి ఏపీసీఎం, తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు చేస్తోందన్నారు.

తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రామచందర్ రావుకు శుభాకాంక్షలు తెలిపి, గోదావరి నది జలాల సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అవసరమైతే సంబంధిత అధికారుల ద్వారా సమాచారం అందజేయాలని చెప్పారు. కేంద్రం బనకచర్ల ప్రాజెక్టుకు పూర్తి స్టాప్ ఇవ్వలేదని, కేవలం కామా మాత్రమే పెట్టామని పేర్కొన్నారు. మోదీ-చంద్రబాబు ప్రభుత్వాలు గోదావరి నదిపై ఆధారపడి ఉండగా, ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగాలని, కేంద్రం పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సోషల్ మీడియా, బీఆర్ఎస్ మీడియా సృష్టిస్తున్న కల్పిత కథనాలపై ప్రజాప్రతినిధులు కన్‌ఫ్యూజ్ కాకూడదని హెచ్చరించారు. తప్పులు చేసిన వారు వాటిని సమర్థించుకుంటున్నారని, ఆ తప్పులను తెలంగాణపై రుద్దాలని చూస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో మేధావులు, రాజకీయ నాయకులు ఏమైనా సలహాలు ఇస్తే స్వాగతిస్తామని కూడా ప్రకటించారు.

ALSO READ  Crime News: వృద్ధురాలిని చంపి మృత‌దేహంపై డ్యాన్స్‌.. హైద‌రాబాద్ కుషాయిగూడ‌లో అమానుషం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *