Hyderabad: రంగరాజన్ కు సీఎం రేవంత్ ఫోన్.. ఏమన్నాడంటే….

Hyderabad: ప్రఖ్యాత అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆయన రంగరాజన్‌ను ఫోన్‌లో సంప్రదించి పరామర్శించారు.

దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం

రంగరాజన్‌పై దాడి ఘటన తన దృష్టికి ముందుగా ఎందుకు తీసుకురాలేదని సీఎం ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు.

పోలీసులకు కఠిన ఆదేశాలు

దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఐదుగురు అరెస్ట్‌

ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తును వేగవంతం చేసి నిజమైన దోషులను శిక్షించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.అర్చకుడు రంగరాజన్‌పై దాడి సంఘటనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ వర్గాలు ఈ ఘటనను ఖండిస్తూ, నిందితులపై కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *