Short News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కొద్ది సేపట్లో నాగర్‌కర్నూల్ జిల్లా కు చేరుకోనున్నారు ఈరోజు నాగర్‌కర్నూల్ జిల్లాలో అయన పర్యటించనున్నారు. రూ.12,600 కోట్లతో అమలు కానున్న ఇందిరా సౌరగిరి జలవికాస పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షల చొప్పున, వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు సోలార్ పంప్‌సెట్లు పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా సీతారామాంజనేయ ఆలయ దర్శనం, అనంతరం బహిరంగ సభలో పాల్గొని, కొండారెడ్డిపల్లెను సందర్శించనున్నారు.