CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా ఎరువులు త్వరగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసారు. సాగు పంటలు ప్రారంభమైన నేపథ్యంలో, ఎరువుల కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి అన్నారు.
వానాకాలం పంటలకు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 5 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా.. కేవలం 3.07 లక్షల టన్నులే అందాయని సీఎం వివరించారు. అలాగే, జులై నెలలో రాష్ట్రానికి 1.6 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 29 వేల టన్నులే వచ్చాయని తెలిపారు.
Also Read: Nara lokesh: విశాఖకు భారీ పెట్టుబడులు… నారా లోకేశ్ పర్యటనకు విశేష ఫలితం
ఇప్పటి పరిస్థితుల్లో యూరియా కోసం రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశీయ ఉత్పత్తిలో తెలంగాణకు ఎక్కువ కోటా ఇవ్వాలని, రైల్వే శాఖ కూడా ఎక్కువ రేక్‌లు కేటాయించి సరఫరా వేగంగా చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
జహీరాబాద్‌కు ప్రత్యేక దృష్టి.. కేంద్రాన్ని కోరిన సీఎం
ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలసి జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (జెఐఎస్సీ) అభివృద్ధికి సహాయం కోరారు.
జెఐఎస్సీకి అవసరమైన రూ.596 కోట్లను త్వరగా విడుదల చేయాలని, అలాగే నీటి, విద్యుత్ వసతుల కల్పనకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని తెలిపారు.
విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్లపై చర్చ
వరంగల్‌లోని విమానాశ్రయానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని, హైదరాబాద్-విజయవాడ మధ్య కొత్త పారిశ్రామిక కారిడార్ (సాధ్యాసాధ్యత అధ్యయనం)feasibility study కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, హైదరాబాద్-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌ను “ఏరో-డిఫెన్స్ కారిడార్”గా అభివృద్ధి చేయాలని సీఎంరెవంత్ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 100 ప్లగ్ అండ్ ప్లే పార్కులను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉందని, వాటికి కేంద్రం పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సమ్మేళనాల్లో పాల్గొన్నవారు:
ఈ సమావేశాల్లో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అయితే, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం భేటీ వాయిదా పడింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవాలనుకున్నా.. సమయాభావం వల్ల భేటీ జరగలేదు.
ఇది కూడా చదవండి:
MLC Kavitha: హక్కుల కోసం మనమందరం కలిసికట్టుగా పోరాడాలి
Hyderabad: కల్తీ కల్లు కలకలం: 11 మంది అస్వస్థతకు గురి