Cm revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే వ్యవహారంపై ఆయన తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు.
సీఎల్పీ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే జయవీర్ హాలును వీడటంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒకవైపు నేను ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే, జయవీర్ ఇలా బయటకు వెళ్లిపోతున్నారు. ఇంత నాన్-సీరియస్‌గా ఎలా ఉంటారు?” అంటూ ప్రశ్నించారు.
అలాగే, “బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉంటే, మీపై వారు అభ్యర్థిని పెట్టరనుకుంటున్నారా? బీఆర్ఎస్ గురించి మీకు చాలా తక్కువ తెలుసు. రాజకీయాలు పిల్లలాట అనుకుని వ్యవహరిస్తే విజయం సాధించడం అసాధ్యం,” అంటూ హెచ్చరించారు.
రాబోయే ఎన్నికల్లో విజయంపై దృష్టి పెట్టాలని, పూర్తిగా ప్లాన్ చేయడంతో పాటు సీరియస్‌గా పనిచేయాలని ఎమ్మెల్యేలకు స్పష్టమైన సూచనలు చేశారు. “ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే ప్లాన్‌తో ముందుకు వెళ్లండి,” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.