Cm revanth: తెలంగాణ రైతులకు అత్యంత అవసరమైన యూరియా ఎరువుల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే లేఖలు రాసినా, విజ్ఞప్తులు చేసినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన మండిపడ్డారు.
“తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతుంటే, వారిని కాపాడే బదులు కేంద్రం వివక్ష చూపిస్తోంది. అయితే, రైతుల పక్షాన నిలిచిన ప్రియాంక గాంధీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు,” అని సీఎం తెలిపారు.
అలాగే, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా మోడీ భజనలో మునిగిపోయారని విమర్శించారు. మరోవైపు పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు కనీసం స్పందించే పరిస్థితి లేకుండా పోయిందని దుయ్యబట్టారు.