Cm revanth: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు చిట్టబోయినపల్లి ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఉన్నత విద్యను పొందేందుకు ఇలాంటి సంస్థలు ఎంతో సహాయపడతాయని చెప్పారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్య ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. “25 ఏళ్లు శ్రమించి చదివితే, తర్వాతి 75 ఏళ్లు గౌరవంగా జీవించవచ్చు” అని విద్యార్థులను ఉత్సాహపరిచారు. కేవలం చదువుకోవడం కాదు, దాని పట్ల నిబద్ధత, ఆసక్తి, క్రమశిక్షణ అవసరమని సూచించారు. చదువుతోనే వ్యక్తి తన కుటుంబం, గ్రామం, రాష్ట్రం ఎదుగుదలకు దోహదపడగలడని అభిప్రాయపడ్డారు.
రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వాల కృషిని గుర్తుచేశారు. నెహ్రూ విద్య మరియు సాగునీటి రంగాలకు బలమైన పునాది వేసారన్నారు. అప్పట్లో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ వేలాది మందికి నీటి వనరుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. భూగరిష్ఠ పరిమితి చట్టం ద్వారా పెద్దల భూములు పేదలకు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. తమ ప్రభుత్వం కూడా విద్య, సాగునీరు, సమాన అవకాశాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు.
