పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ అన్నారు. ఇవాళ్టి నుంచి 10 రోజులపాటు తెలంగాణ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనుంది ప్రభుత్వం. గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పోలీసు అమరలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు శాంతిభద్రతలే కీలకం శాంతిభద్రతలు లేని రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టరని చెప్పారు.
పోలీసుల ఖర్చులు, ఇతర ఏర్పాట్లకు నిధులు కేటాయిస్తామన్నారు. ఖద్దరును, ఖాకీని ఈ సమాజం నిశితంగా గమనిస్తుందని గుర్తించాలన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాని చెప్పారు.భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేదనిది. రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయంటే పోలీసులే కారణం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందేందుకు శాంతిభ్రతలే కీలకం. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి. శాంతి భద్రతలు, నిఘా విషయంలో రాష్ట్ర పోలీసుల పాత్ర కీలకమన్నారు.
అమరులైన పోలీసులకు కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. పెరుగుతున్న ఆధునిక సాంకేతికత ద్వారా నేరాలు చేస్తున్నారు. నేరగాళ్లు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నారు. తెలంగాణ పోలీసుల విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్ది చెప్పారు.
