CM revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రధాన అంశాలపై ప్రధానికి విజ్ఞప్తులు సమర్పించినట్టు ఆయన తెలిపారు.
విజ్ఞప్తిలో ఉన్న 5 ప్రధాన అంశాలు:
1. హైదరాబాద్ మెట్రో విస్తరణ – హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణకు కేంద్రం సహకారం అందించాలని కోరారు.
2. మూసీ నది సుందరీకరణ – మూసీ నదిని అభివృద్ధి చేసి, నగరానికి ఒక అందమైన ఆకర్షణగా మార్చేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
3. రీజనల్ రింగ్ రోడ్ (RRR) – తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేందుకు అనుమతులు మరియు నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు.
4. ఐపీఎస్ కేడర్ పెంపు – రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
5. కేంద్ర సహకారంపై స్పష్టత – తెలంగాణకు రావాల్సిన నిధులు, పథకాల అమలు విషయాల్లో స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఈ విషయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర సహకారం అత్యవసరమనిఆయన స్పష్టం చేశారు.
