Cm revanth: 15 రోజుల్లో కోదండరాంను చట్ట సభలో ఉంచుతా..

Cm revanth : ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ అవిభాజ్య సంబంధం కలిగినవని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఓయూ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ.90 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌తో పాటు దుందుభి, బీమా వసతి భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఓయూ వీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఓయూ చరిత్ర – తెలంగాణ ఆత్మ

సీఎం రేవంత్ మాట్లాడుతూ, “ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం” అన్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పీవీ నరసింహారావు వందేమాతరం పాడిన గడ్డ ఇదేనని గుర్తుచేశారు. సాయుధ పోరాటం నుండి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు ఓయూ విద్యార్థులు చరిత్ర సృష్టించారని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్ గౌడ్, మదన్మోహన్, జైపాల్ రెడ్డి వంటి నేతలు కూడా ఓయూకే చెందిన వారని చెప్పారు.

“తెలంగాణ ఉద్యమంలో యాదయ్య, శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి వంటి అమర వీరులను ఓయూ ఇచ్చింది” అని అన్నారు. కొందరు ఉస్మానియాను కాలగర్భంలో కలిపేయాలనుకున్నారని ఆరోపించారు. “108 ఏళ్ల యూనివర్సిటీకీ ఓ దళితుడిని వీసీగా నియమించాం, ఇక్కడే చదివిన వారికి విద్యారంగంలో కీలక పదవులు ఇచ్చాం” అని వెల్లడించారు.

విద్యతోనే పేదల భవిష్యత్తు

దేశానికి యువ నాయకత్వం అవసరమని, సమస్యల చర్చతో పాటు సైద్ధాంతిక అంశాలపై కూడా డిబేట్ జరగాలని అన్నారు. సమాజంలో అసహనం, అశాంతి పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. “డ్రగ్స్, గంజాయి కల్చర్ విద్యాసంస్థల్లో వేగంగా విస్తరిస్తోంది. చైతన్యవంతమైన చర్యలు లేకపోవడం వల్లే ఇది జరుగుతోంది” అని సీఎం హెచ్చరించారు.

“పేదలకు పంచేందుకు భూములు లేకపోవచ్చు కానీ, వారి తలరాతలు మార్చేది నాణ్యమైన విద్యే” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రొఫెసర్‌ కోదండరాంను 15 రోజుల్లో చట్ట సభకు పంపుతాం.. ఎవరు అడ్డం వస్తారో చూస్తా.. ప్రొఫెసర్‌ ఎమ్మెల్సీగా ఉంటే తప్పేంటి?.. HCUలో క్రూర మృగాలు లేవు.. మానవ రూపంలో ఉన్న మృగాలన్నీ ఫాంహౌస్‌లో ఉన్నాయి-సీఎం రేవంత్‌రెడ్డి

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *