Cm revanth: ఉచిత విద్యా అని చెప్పి కేసీఆర్ ఆగం చేసిండు

Cm revanth: రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్యా విధానం అమలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం గప్పాలు కొట్టిందని, కానీ దాన్ని అమలు చేయకముందే గద్దె దిగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శిల్పకళావేదికలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన విద్యా రంగంలో గత పది ఏళ్ల పరిస్థితులపై సీరియస్ కామెంట్లు చేశారు.

సీఎం మాట్లాడుతూ, “విద్యా శాఖలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అందుకే నేను స్వయంగా ఈ శాఖను దగ్గర పెట్టుకుని పర్యవేక్షిస్తున్నాను. ఎవరు మంత్రిగా వచ్చినా ఈ ఒత్తిడిని తట్టుకోలేరు” అని అన్నారు.

గత పది ఏళ్లలో టీచర్ల బదిలీలు జరగలేదని, కొత్త నియామకాలపై కూడా ఆలోచించలేదని బీఆర్ఎస్‌ను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. “విద్యను కూడా వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకున్నారు. అసలు విద్యా రంగాన్ని పట్టించుకోలేదు” అని ఆరోపించారు.

తాము అధికారంలోకి వచ్చాక తరచుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని గుర్తు చేసిన సీఎం, “గురుపూజోత్సవం జరిగితే గతంలో ఒక్కసారైనా సీఎం వచ్చారా? అప్పటి ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని నిర్వహించిందా?” అంటూ సెటైర్లు వేశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “టీచర్లను చిన్నచూపు చూడడం మా ప్రభుత్వానికి అలవాటు కాదు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మరో 11 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల మంది చదువుతున్నారు” అని వివరించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *