Cm revanth: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను గౌరవిస్తూ ఈ సర్వేను నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు.
సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం సాధనకై ఈ కులగణన నివేదిక ఎంతో ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. అర్బన్ మరియు రూరల్ ఏరియాల మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసాలను విశ్లేషించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీ అధ్యయనం చేసి సరైన సూచనలు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు.
ప్రజల యథార్థ అవసరాలను గుర్తించి, అందరికీ సరైన సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులందరికీ ప్రభుత్వ లబ్ధి అందాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.