Cm revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కలిశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ BRS, బీజేపీపై మండిపడ్డారు.
రేవంత్ వ్యాఖ్యానిస్తూ BRSను కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టేశారని, ఆ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసినట్టైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మోదీకి మద్దతు ఇస్తుండటం మైనార్టీలకు ప్రమాదకరమని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేయడం అంటే కమలం గుర్తుకు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. మైనార్టీలను మభ్యపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు అయినా ఇంతవరకు చర్యలు లేకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ, BRSల మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని అన్నారు
సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ విచారించగల్గితే, కేసీఆర్, కేటీఆర్, తన్నీ హరీష్ రావును ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. బీజేపీలో BRS విలీనమయ్యే పరిస్థితి ఉందని, ఇదిగో గతంలో కవితే ఈ విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ, BRS కలయిక కోసం జూబ్లీహిల్స్‌ను ప్రయోగశాలగా చూస్తున్నారని ఆరోపించారు.

