Pawan-Chandrababu: విజయవాడ నగరంలో దేశభక్తి సందేశాలతో సాగిన తిరంగా యాత్ర ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు మూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు పురంధేశ్వరి ముందుండగా, కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు జాతీయ జెండాలను చేతబట్టి ఊరేగారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ –
“మేం ఎవరి జోలికి రాము కాదు… కానీ మా జోలికి వస్తే తరిగిపోతారు. దేశం మీద కన్నేసే ఉగ్రశక్తులకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది” అని హుందాగా హెచ్చరించారు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంగా పూర్తయిందని ప్రకటించిన చంద్రబాబు,
“మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేసే వారికి ఈ భూమ్మీద స్థానం ఉండదు. ఈ దేశంలో ఉగ్రవాదానికి తావు లేదు” అని స్పష్టం చేశారు.
అలాగే, ఈ ర్యాలీ ప్రజల చేతుల మీదుగా ప్రారంభమైందని, ఇది ఒక ప్రజా ఉద్యమమై మారిందని పేర్కొన్నారు.
“పింగళి వెంకయ్య వంటి మహనీయులు రూపుదిద్దిన జాతీయ జెండా ఓ గౌరవప్రతీక. దాన్ని ధరించి ప్రాణాలు అర్పించిన అమరజీవుల్ని మరిచిపోవడం మనకు తగదు” అని అన్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ సర్జికల్ దాడులు జరపడం వల్లే ఆ దేశం తలదించుకునే పరిస్థితికి చేరిందని వివరించారు.
“భారత్ తలుచుకుంటే పాక్ ఆట అంతే సంగతులు అవుతాయి. మోదీ నాయకత్వంలో దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు,” అని చంద్రబాబు స్పష్టమన్నారు.
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ –
“దేశ రక్షణకోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగం వెలకట్టలేనిది. మనం దేశం కోసం ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.
భారతదేశాన్ని 2045 నాటికి ప్రపంచంలో నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలంటే ప్రతీ ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అంతేగాక, ఆపరేషన్ సిందూర్ వంటి ఆర్మీ యాక్షన్లు ప్రపంచంలోని అన్ని ఉగ్రవాదులకు హెచ్చరికగా నిలవాలని, భారతదేశం శాంతిని కోరినా, సైనిక శక్తి విషయంలో తగ్గేది లేదని తేటతెల్లం చేశారు.
ఇది కూడా చదవండి: Covid-19: కొవిడ్ మళ్లీ ముంచుకొస్తుందా? లాక్‌డౌన్ తప్పదా?