CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసారి విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో, కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
మే 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగా మంత్’ నిర్వహించాలని సీఎం సూచించారు. ఈ నెలరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి వార్డులో యోగా శిబిరాలు, సాధన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టంగా తెలిపారు. యోగా సాధనలో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు (సర్టిఫికెట్‌లు) అందించాలన్నారు.
జూన్ 21న విశాఖ ఆర్కే బీచ్ నుంచి సముద్రతీరంపైనే లక్షలాది మంది పాల్గొనేలా భారీ యోగా డే నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ప్రధానమంత్రి మోదీ కూడా ప్రజలతో కలిసి యోగా చేయనున్నారని, ఇది దేశం దృష్టిని ఏపీ వైపు తిప్పే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు.
Also Read: Vallabhaneni Vamsi: గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ జైల్లోనే
CM Chandrababu: ఈ ఒక్కరోజు కార్యక్రమంతోనే ఆగకుండా, యోగా సాధనను ప్రజల దైనందిన జీవనశైలిలో భాగం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వ్యాప్తి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.