Chandrababu: మరో వినుత్న అలోచనకు శ్రీకారం చుట్టారు సిఎం చంద్రబాబు నాయుడు..రాష్ట్రంలో శాంతి భద్రతలు,సహజ వనరుల రక్షణ, రియల్ టైం లో పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వమే మూడు ఉపగ్రహాలను సోంతగా ఏర్పాటు చేయాలని సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు..దీంతో అధికార వర్గాల్లో దీని పై విసృత చర్చకు కారణమైంది.. నిజంగా రాష్ట్ర ప్రభుత్వమే మూడు ఉప గ్రహాలను ఏర్పాటు చేయడం సాధ్యమేనా? ఇదే చేస్తే ఏపి వేరే లేవల్ కి వెళ్లనుందా? వాచ్ దిస్ స్టోరీ..
అందరి కన్నా భిన్నంగా అలోచించడంలో దేశంలోనే ముందుడే పొలిటిషియన్ ఏపి సిఎం చంద్రబాబు నాయడు..ఇదే సమయంలో అన్ని రంగాల్లో ఏపిని అగ్రభాగాన నిలబెట్టాలని పరిపిస్తుంటారు..తాజాగా నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వమే సొంతగా ఉపగ్రహాలను తమ అవసరాల కోసం ఏర్పాటు చేసుకుంటే ఏలా ఉంటుందని కలెక్టర్ల సదస్సులో ప్రకటించి అందరిని అశ్చర్యపరిచారు..సహజంగా ఉపగ్రహాలను ఆయా దేశాలు,లేదా దిగ్గజ సంస్థల తమ అవసరాల కోసం సొంతంగా ఉపగ్రహాలను ప్రయోగించి వినియోగించుకుంటున్నాయి..ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఉపగ్రహాలను ప్రయోగించిన దాఖలాలు లేవు..కానీ ఏపి ప్రభుత్వం మాత్రం అలాంటి అలోచన చేయడం మాత్రం సాహసమే అనాలి..ఒక్కటి కాదు ఏకంగా మూడు ఉపగ్రహాలను రాష్ట్ర ప్రభుత్వంమే సొంత అవసరాల కోసంప్రయోగించి,ఉపయోగించుకోవడం కొంత సాహసమనే చేప్పాలి..అలాంటిది ఏపి సియం చంద్రబాబు చేస్తున్నారంటే.. అయన ఎంత ప్లాన్ చేసి ఉంటాడో అన్న చర్చ జరుగుతుంది..
ఇది కూడా చదవండి: CM Chandrababu: రెండు రోజుల కలెక్టర్ల సదస్సు . . డీఎస్సీ నుంచి టూరిజం దాకా చంద్రబాబు ఏమి చెప్పారంటే . .!
రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్ లో ఇలాంటి అవసరాలు ఉంటాయని సిఎం చంద్రబాబు ముందుగానే అంచనా వేశారా అన్న చర్చకూడా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది..దీనికి కారణం లేక పోలేదు..ఈ మధ్యనే ఇస్రో మాజీ ఛైర్మన్ స్వామినాధ్ ను ఏపి ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు క్యాబినెట్ హోదాలో నియమించింది..సిఎం చంద్రబాబు అలాంటి అలోచన ఉంది కాబట్టే స్వామినాధ్ ను నియమించారా? అనే చర్చకు దారి తీసింది..సొంతంగా ఒక్కోక్క ఉపగ్రహం ఏర్పాటు కు దాదాపు 500 కొట్లు అవసరమని అంచనా..ప్రభుత్వ ఏపి ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి అందుకు సహకరిస్తుందా అన్న అలోచన కూడా ఉంది..నిజంగా మూడు ఉపగ్రహాలను ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏం చేయవచ్చు అన్న చర్చ కూడా జరుగుతుంది..ఉపగ్రహాలకు సిసిటీవీ కెమేరాలు,డ్రోన్స్, ఐఒటి పరికరాలు అమర్చడం ద్వారా దానిని ఎఐ కి అనుసంధానించడం ద్వారా సమాచార సేకరణ పాటు, ప్రజలకు రియల్ టైమ్ సేవలు మరింతగా అందించవచ్చన్న అలోచనలో సిఎం చంద్రబాబు చేసినట్లు ప్రచారం..అయితే ఇది ఏమాత్రం వయిబిలిటి ఉంటుందన్న దానిపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది.. చూడాలి సిఎం చంద్రబాబు అలోచన ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో?