CM Chandrababu: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా ప్రత్యేక సందేశం ఇచ్చారు. ప్రకృతి ఎవరి ఒక్కరిదీ కాదని, దాన్ని సంరక్షించడం మన అందరి బాధ్యత అని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భారీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులో కోటి మొక్కలు నాటే ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, మంచి పరిసరాలు ఉండాలి అంటే మొక్కలు నాటి ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
అడవుల్ని కాపాడటం, జల వనరులను సురక్షితంగా ఉంచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి చర్యలు అత్యవసరమని చంద్రబాబు వివరించారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ థీమ్ “ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన” కావడం గమనార్హం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పునర్వినియోగం చేసే అలవాట్లు అలవర్చుకోవాలని ఆయన సూచించారు.
Also Read: TTD Ghee Scam: శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
CM Chandrababu: ఇకపోతే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెత్తను ఇంధనంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతోందని ఆయన వివరించారు. స్వచ్ఛ భారత్ సంకల్పంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు.
చివరగా, పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఉద్యమంలో భాగమవ్వాలనీ పిలుపునిచ్చారు.
#EnvironmentDay
ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తూ కాదు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. అడవులను కాపాడుకోవడం, జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు…— N Chandrababu Naidu (@ncbn) June 5, 2025

