CM Chandrababu: ప్రజల నుండి ప్రభుత్వానికి ఎలాంటి ఫిర్యాదుల రానప్పుడే ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు సరిగ్గా పనిచేసినట్లని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో జీరో పావర్టీ కోసం తెచ్చిన కొత్త విధానం పి-4 గేమ్ చేంజర్ గా నిలుస్తుందని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్దిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే వారికి సంపద దక్కుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 20 లక్షల కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పాఠశాలలు తెరిచేలోగా నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
సచివాలయంలో రెండు రోజులు పాటు జరిగే కలెక్టర్ల సదస్సు లో సియం చంద్రబాబు పలు శాఖలపై అధికారులు ప్రజెంటేషన్ల పై సియం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నామని చెప్పారని సియం ప్రకటించారు.. ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని.వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదన్నారు. అందుకే మాకు విస్తృతమైన మద్దతు ఇచ్చారన్న సియం.కలెక్టర్లు కూడా సుపరిపాలన ద్వారా మంచి ప్రభావాన్ని చూపించగలరన్నారు..
పాలన రొటీన్ కంటే భిన్నంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ తపన అన్న సియం..2014లో ఏపీని పునఃనిర్మాణం చేస్తున్నామని చెప్పాం ఇప్పుడూ అదే చెబుతున్నామన్నారు..ఒక వ్యక్తి స్వార్దం కారణంగా గత ఐదేళలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం జరిగిందన్నారు.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందించాలని..9.7 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రానికి ఉన్నాయి, డెబ్డ్ సర్వీసింగ్ చేయాలన్నారు.. అప్పులు, వడ్డీలు కట్టాలి అదే సమయంలో సంక్షేమం కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తామని ..9 నెలల కాలంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామని..వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని సియం చంద్రబాబు ప్రకటించారు..ఏప్రిల్ నుంచి మొదలు పెట్టి జూన్ లో పాఠశాలలు తెరిచే లోపు నియామకం పూర్తి కావాలన్నారు..
ఎస్సీ వర్గీకరణ పై కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు
సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతిమ లబ్దిదారు వరకూ ఫలాలు చేరాల్సిందేనని సియం చంద్రబాబు స్పష్టం చేశారు..మొన్నటి వరకు అయోమయంలో పెట్టిన పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టామన్న సియం..అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని మరో స్పష్టం చేశారు… అమరావతి నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని..అమరావతిని 2027 లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు..
అమరావతి నిర్మాణం కోసం తెచ్చిన అప్పులను ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా తీర్చేస్తామన్నారు..అమరావతి నిర్మాణంలో ప్రజలూ భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకున్నామని..భవిష్యత్ లో వచ్చే పెద్ద ప్రాజెక్ట్ లకు కూడా ఇదే తరహా అమలు చేయాలని కలెక్టర్ల కు సియం సూచించారు.. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణంలోనూ ఈ తరహా మోడల్స్ ను చేపట్టాలని ఆ జిల్లా కలెక్టర్లు సియం సూచించారు..55 వేల కోట్ల రుపాయిలతో ఏపిలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నాయని వాటిని ఆటోపైలట్ మోడల్ లో పూర్తి చేయాలని..ఇదే క్రమంలో 75 వేల కోట్ల రుపాయిల విలువైన రైల్వే ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయని..అవి అభివృద్ధి చెందితే రాష్ట్రానికే ఉపయోగపడతాయని కలెక్టర్లు ఆలోచించాలన్నారు..
ఫించను 40 రుపాయిలు నుండి 4వేల వరకు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అనే విషయం ను సియం గుర్తు చేశారు..ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్ని సియం.. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని, రూ.15 వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామనిపునరుద్ఘాటించారు..పాఠశాలలు తెరిచేలోగానే ఈ తల్లికి వందనం పథకంద్వారా ఆర్ధిక సాయం అందిస్తామన్నారు..అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు దఫాలుగా రూ.20 వేల రూపాయలు ఇవ్వబోతున్నామని.. కేంద్ర పధకం తో పాటే మూడు విడతల గా లబ్దిదారులు ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు..మత్స్యకారులకు కూడా ఆర్ధిక సాయం అందించే కార్యక్రమం కూడా చేపడతామన్నారు..
ఇది కూడా చదవండి: Dwarka: గుజరాత్‌లోని బెట్ ద్వారక, యుఎడబ్ల్యు లో తవ్వకాలు..
వేసవిలో మంచినీటి సమస్య కనిపించకూడదని జిల్లా కలెక్టర్లకు సూచించిన సీఎం చంద్రబాబు.. వేసవి పూర్తి అయ్యేంత వరకూ జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. మంచి నీళ్ల సమస్యలపై జీపీఎస్ – రియల్ టైమ్ పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.. పట్టణ ప్రాంతాల్లోనూ మంచినీటి సమస్య లేకుండా చూడాలని సియం సూచించగా.. నీటి సరఫరాపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని మున్సిపల్ శాఖ అధికారులు సియం కు వివరించారు..పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది, పసుగ్రాసం ఇబ్బంది లేకుండా చూడాలని..
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే 15 రోజుల్లో 12,138 తొట్టెల ఏర్పాటు పూర్తి చేయాలని సియం సూచించారు..స్వయం సహాయ సంఘాల ద్వారా పచ్చిమేత పెంపకానికి చర్యలు చేపట్టాలన్న సీఎం..ప్రతీ జిల్లాలో కనీసం 10 వేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి చొరవచూపాలని స్పష్టం చేశారు..గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ అత్యాధునిక నమూనాలను అభివృద్ధి చేయాలన్నారు..అవసరమైన చోట్ల డ్రోన్ల సాయం తీసుకోవాలన్నారు.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సమర్ధంగా వినియోగించుకోవాలని వీటీ ద్వారాచెక్ డ్యామ్ లన్నీ మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని అదేశించారు.. పల్లెల్లో వలసలు లేకుండా చూడాలని ఈ విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రద్ద పెట్టాలని సూచించారు.. వైద్యారోగ్యంపైనా ప్రధానంగా దృష్టి పెట్టాలని..సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు..
పియం సూర్య ఘర్ పధకం ద్వారా ప్రతి నియోజక వర్గంలో 10 వేల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేయాలని దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సియం చంద్రబాబు సూచించారు..డెమాక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అనేది కొత్త విధానమన్నసియం..20 లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ అమర్చటం లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్లన కోరారు..ఎస్సీ,ఎస్టీలకు 100 శాతం సబ్సీడి ఇస్తున్నందు వలన వారికి ఇప్పటికే 200 యూనిట్ల వరకు విద్యుత్ ప్రిగా ఇస్తున్నామన్న సియం..వీరికి రూఫ్ టాప్ లు ఏర్పాటు చేస్తే వారికి అదనంగా మిగిలిన విద్యుత్ అమ్ముకోవడం ద్వారా కొంత ఆదాయం కూడా వస్తుందన్నారు.రెండున్నర దశాబ్దాల కింద మొదలు పెట్టిన అరకు కాఫీ ఇప్పుడు ప్రముఖ బ్రాండ్ గా మారిందని..దీనిని జిల్లాల్లో అందరు ప్రోత్సాహించాలన్నారు..
రాష్ట్రంలో సంపద సృష్టి పెరిగితే దానిని సంక్షేమానికి ఖర్చు పెట్టగలమన్నారు సియం చంద్రబాబు..రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెంచే దానిపై చర్యలు తీసుకోవాలన్నారు.. స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపోందించుకుని 10 సూత్రాల ఆధారంగా పనిచేయాలని..రాష్ట్రం జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధిలోని ప్రజల వరకు ఈ ప్రణాళికలు చేరాల్సిందేనని సియం స్పష్టం చేశారు..జీఎస్డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాలని..వచ్చే ఏడాదికి 15 శాతం ప్లస్ జీఎస్ డీపీ సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు..వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ల సియం సూచించారు..
రాష్ట్రంలో శాంతి భద్రతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సియం చంద్రబాబు సమీక్షించారు.. సమీక్షలో నేరాల నియంత్రణపై పోలీసు శాఖ నుండి ప్రజెంటేషన్ ఇచ్చారు..టెక్నాలజీ ద్వారా కేసుల పరిష్కారం, నేరస్తులను శిక్షించడంలో అనుసరిస్తున్న విధానాలను అధికారులు వివరించారు..డిజిటల్ అరెస్టులు, కొత్త తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు..నేరస్తులను గుర్తించే విషయంలో సాకేంతికతను ఎక్కువగా ఉపయోగించాలన్న సిఎం అన్నారు..క్రైం సీన్ జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలను సేకరించే విషయంలో కొత్త పద్దతులను అనుసరించాలని సూచించారు..
నేరస్తులు చాలా తెలివైన వాళ్లు…సాక్ష్యాలు దొరక్కుండా అనేక మాయలు చేస్తారు…విచారణ అధికారులు మరింత చురుగ్గా, తెలివిగా వ్యవహరించాలని సిఎం అన్నారు..నేరాలు చేసి పారి పోయేవారు కొందరు అయితే…నేరాలు చేసి పక్క వారిపై నెట్టేవారు మరి కొందరు అంటూ సిఎం వ్యాఖ్య నించారు..ఇందుకు వివేకా హత్య ఒక్కటి చూస్తే నేరాల విషయంలో పెద్ద కేస్ స్టడీ అంటూ సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు..వివేకా హత్య విషయంలో తీసుకున్న మలుపులు మనం గుర్తుపెట్టుకోవాలన్నారు..ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణ విషయంలో ఎస్వోపీ ద్వారా పక్కాగా వ్యవహరించాలన్నారు..
నేరస్తుల గుర్తింపు, తక్షణం శిక్ష పడేలా చేయడంలో క్లూస్ టీం కీలక పాత్ర పోషించాలని..నేరం జరిగిన ప్రాంతాన్ని ముందుగా ప్రొటక్ట్ చేసి సాక్ష్యాలు చెరిగిపోకుండా చూడాలన్న సిఎం ఆదేశించారు..పోలీస్ శాఖకు అవసరమైన పోలీస్ డాగ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని సియం అధికారులకు సూచించారు..
ఇక రెండో రోజు కలెక్టర్ల సదస్సులో అన్ని జిల్లాల్ల సమగ్ర ప్రణాళికలపై కలెక్టర్లు ప్రజెంటేష్ ఇచ్చారు…తలసరి ఆదాయం లో విశాఖ జిల్లా ఫస్ట్ గా.. శ్రీకాకుళం జిల్లా లాస్ట్ లో నిలిచింది..అయా జిల్లాల్లో అభివృద్దికి ఉన్న అవకాశాలు వివరించారు..ప్రధానంగా రాయల సీమ జిల్లాలో ఉద్యనవన పంటలు ఉన్న అవకాశాలు, ఆదే క్రమంలో అక్కడ భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కు ఉన్న అవకాశాలను వివరించారు.. పలు జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్దితో పాటు.. ఎంఎస్ఎంఈ ల ఏర్పాటు కు ఉన్న అవకాశాలు, అక్కడ ఉన్నయువత విద్యా ఉద్యోగ అర్హతలతో పాటు వారికి ఉన్న స్కిల్ లపై వివరించారు.