CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
పర్యటన వివరాలు:
- ఉదయం 11:45 గంటలకు: గన్నవరం విమానాశ్రయం నుండి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.
- అక్కడ నుండి: హెలికాప్టర్‌లో జమ్మలమడుగుకు బయలుదేరుతారు.
- మధ్యాహ్నం 12:25 గంటలకు: జమ్మలమడుగులోని గూడెం చెరువు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 12:50 నుండి 2:00 గంటల వరకు: గూడెం చెరువులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
- అనంతరం: జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారికి కీలక సూచనలు చేస్తారు.
- సాయంత్రం 4:00 గంటలకు: గండికోటకు చేరుకుంటారు. అక్కడ గండికోట వ్యూ పాయింట్‌ను సందర్శిస్తారు.
- గండికోట వద్ద: ₹78 కోట్లతో సాస్కీ పథకం కింద చేపట్టనున్న గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
- ఆ తర్వాత: వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములైన ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
- సాయంత్రం 6:00 గంటలకు: కడప విమానాశ్రయం నుండి విజయవాడకు తిరిగి బయలుదేరుతారు.
Also Read: Karedu: కరేడు ఉద్యమంలో ఎర్ర చందనం దొంగలు ఎంటరయ్యారా?
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కడప జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు. పింఛన్ల లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.