Chandrababu Naidu

Chandrababu Naidu: ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్!

Chandrababu Naidu: ఆశా వర్కర్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవు, వయో పరిమితి పెంపు, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం చంద్రబాబు ప్రకటించిన ముఖ్యమైన పథకాలు:

🔹 ప్రసూతి సెలవు: తొలి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవు మంజూరు.
🔹 వయో పరిమితి పెంపు: గరిష్ట వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా చేసిన ప్రభుత్వం.
🔹 గ్రాట్యుటీ సౌకర్యం: ఉద్యోగం ముగిసే సమయంలో రూ.1.5 లక్షల వరకు గ్రాట్యుటీ అందించే అవకాశం కల్పించారు.

ఇది కూడా చదవండి: Amit Shah: ఢిల్లీలో నిర్మాణాలకు పోలీసుల అనుమతి అవసరం లేదు.. ఢిల్లీపై అమిత్ షా సమీక్ష..

ప్రస్తుతం ఆశా వర్కర్ల స్థితిగతులు:

📌 వేతనం: నెలకు రూ.10,000/-
📌 మొత్తం 42,752 ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు.
📌 గ్రామీణ ప్రాంతాల్లో: 37,017
📌 పట్టణ ప్రాంతాల్లో: 5,735

త్వరలోనే ప్రభుత్వ ఉత్తర్వులు (G.O) విడుదల కానుండగా, ఈ నిర్ణయం వేలాది ఆశా వర్కర్లకు సంతోషం కలిగించే అంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *