Cm chandrababu; సూపర్-6 హామీల అమలుపై ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
తల్లికి వందనం పథకం – మే నెలలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
అన్నదాత పథకం – తల్లికి వందనం అమలుకు వెంటనే ఇది ప్రారంభమవుతుందని తెలిపారు.డీఎస్సీ నిర్వహణ – విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేస్తామని ప్రకటించారు.తల్లికి వందనం పథకం ప్రయోజనం – ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, ప్రతి ఒక్కరికి రూ.15,000 చొప్పున అందజేస్తామని తెలిపారు.
రైతు భరోసా – రైతన్నకు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి మూడు విడతల్లో రూ.20,000 అందజేస్తామని ప్రకటించారు.
మత్స్యకారుల సంక్షేమం – చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సాయం అందజేస్తామని వివరించారు.
ఈ ప్రకటనలతో ప్రభుత్వం తమ హామీల అమలుపై స్పష్టత ఇచ్చిందని, ప్రజలకు మేలు చేసే విధంగా అన్ని పథకాలనూ వరుసగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.