CM chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కూడా దారుణంగా మారిందని చెప్పారు. కేంద్రం విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు అందించిందని వివరించారు. డబ్బులు ఉంటే పథకాలను అమలు చేయడంలో క్షణం కూడా ఆలోచించక తప్పదని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితి పట్ల నిజం చెప్పడం మాత్రమే తన లక్ష్యమని, పరిస్థితి బాగోలేదని, కానీ ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలను అమలు చేస్తామని అన్నారు. అప్పు చేసి అయినా సరే ఇచ్చిన మాటలను నిలబెడతామన్న ఆయన, “తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ” వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల విలువైన సమయాన్ని కోల్పోయిందని, 2019 నాటి వృద్ధి రేటు కొనసాగి ఉంటే రాష్ట్ర సంపద పెరిగేవని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలన ఫలితంగా రాష్ట్రం ₹9.5 లక్షల కోట్ల అప్పు, వాటి వడ్డీలు చెల్లించాల్సి రావడాన్ని కూడా ఆయన వివరించారు.ప్రస్తుతం అన్ని వ్యవస్థలను క్రమంలో పెట్టిపోతున్నామని, సంక్షేమ పథకాల అమలులో ఎప్పుడూ వెనుకడుగు వేయబోమని చంద్రబాబు తెలిపారు.