CM chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులు కేటాయించడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం సమర్థంగా పని చేయాలంటే టీమ్‌వర్క్ చాలా ముఖ్యమని, మంత్రులందరూ సమిష్టిగా పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.
అసాధారణంగా, వేగంగా పని చేసినప్పుడే రాష్ట్రాన్ని పునర్నిర్మించగలం.ప్రభుత్వం విధ్వంసమైన స్థితిలో ఉండటం వల్ల, తీర్మానాలు తీసుకోవడంలో త్వరితగతిన పనిచేయడం అవసరం.అందుకే ఫైళ్ల క్లియరెన్స్‌లో ర్యాంకులు ఇచ్చాం.ఎవరినీ తక్కువ చేయడానికి ఈ ర్యాంకులు ఇవ్వలేదు, పరిపాలనా వేగం పెంచేందుకు మాత్రమే. మంత్రులు తమ శాఖల్లో మంచి ప్రతిభ చూపించాలి.
నేను కూడా నా స్థానాన్ని మెరుగుపర్చుకోవాలి.
ఈ ర్యాంకుల విధానం పరిపాలనలో స్పష్టత, సమర్థత, వేగం పెంచేందుకు ఉద్దేశించిందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పనితీరు మెరుగుపడాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.