cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004, 2019 ఎన్నికల్లో తన ఓటమికి ఎవరూ కారణం కాదని, తన తానే కారణమని పేర్కొన్నారు.
ఓటమికి నా తప్పిదాలే కారణం
చంద్రబాబు మాట్లాడుతూ, “2004, 2019 ఎన్నికల్లో నన్నెవరూ ఓడించలేదు. కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయాం,” అని పేర్కొన్నారు. పాలనలో పూర్తిగా నిమగ్నమై ఉండటం వల్ల పార్టీతో పాటు ఎమ్మెల్యేలతో సమన్వయం కుదరలేదని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే గెలుపు మార్గం
ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమికి తావుండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పరిపాలనా పరంగా కొన్ని లోపాలు జరిగాయని, వాటిని గుర్తించి పరిష్కరించుకుంటే భవిష్యత్తులో విజయవంతం కావచ్చని అన్నారు. అసెంబ్లీలో జరిగిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు చేసిన ఆత్మవిమర్శ, పరిపాలనపై చేసిన విశ్లేషణ తన రాజకీయ దారిని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.
