Cm chandrababu: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇథనాల్ ప్రాజెక్ట్, లైఫ్ స్కూల్, గోశాలలను ప్రారంభించారు. ఇథనాల్ పరిశ్రమతో రైతులకు మంచి జరగబోతుందని, వ్యవసాయాభివృద్ధికి ఇది సహకరిస్తుందని ఆయన అన్నారు.
సీఎం చంద్రబాబు గోశాలలో ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపారు. నందగోకులంలో పేద పిల్లలకు ఉన్నత స్థాయి విద్య అందిస్తున్నారని, ప్రతి పీ-4 కేంద్రంలో అందరూ భాగస్వాములు కావాలి అని పేర్కొన్నారు.
చంద్రబాబు నెల్లూరు జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మార్చేందుకు ప్రతిజ్ఞ బద్ధరుగా ఉన్నట్లు చెప్పారు. త్వరలో రామాయపట్నం, దుగ్గరాజుపట్నం ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్-1 స్థానం పొందగలదని, దేశంలో ఏపీని నెంబర్-1గా మార్చే లక్ష్యంతో పనిచేస్తామని చంద్రబాబు తెలిపారు.