Cm chandrababu: డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

Cm chandrababu : రాష్ట్రంలో నేరాలను అరికట్టేందుకు, నిషేధిత పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు టీడీపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఉపేక్షించబోమని, లా అండ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా అమలు చేయాల్సిందేనని ఆయన అన్నారు.

డ్రగ్స్‌, గంజాయి పై యుద్ధం

రాష్ట్రంలో కొంతమంది డ్రగ్స్‌, గంజాయికి అలవాటు పడినవారు ఉన్నారని, వారిని పట్టుకొని సరికొత్త జీవితాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. డ్రగ్స్‌, గంజాయిపై యుద్ధం ప్రారంభించామని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

లేటెస్ట్‌ టెక్నాలజీ వినియోగం

డ్రగ్స్‌ అక్రమ రవాణా, గంజాయి సాగు వంటి సమస్యలను సమూలంగా నిర్మూలించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, నేరస్థులను పట్టుకునేందుకు లేటెస్ట్‌ టెక్నాలజీని అమలు చేస్తున్నామని చెప్పారు.

ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు

గంజాయి సాగును పూర్తిగా అరిట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే, గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. వారి జీవితాలను మారుస్తూ, చట్టబద్ధమైన మార్గాల్లో జీవనోపాధి కల్పించేలా పథకాలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు.

“రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారెవరైనా కఠిన చర్యలు ఎదుర్కొంటారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే, లా అండ్‌ ఆర్డర్‌ను పటిష్ఠంగా అమలు చేయాల్సిందే!” అని సీఎం చంద్రబాబుస్పష్టం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *