Cm chandrababu: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పార్టీ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించిన ఆయన, కొత్త ప్రభుత్వ పాలన మొదలై ఏడాది నిండిన దశలో నేతలతో వృద్ధి మార్గంపై చర్చించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కీలక అంశాలను వెల్లడించారు. ఈ నెల 23 నుంచి “తొలి అడుగు” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా నిబద్ధత కలిగిన నాయకులతో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే, జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తల కోసం నాయకత్వ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
పార్టీకి ఎమ్మెల్యేలు ప్రతి రోజు కొంత సమయం కేటాయించాలని చంద్రబాబు సూచించారు. పార్టీ శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చాటాలి అని పిలుపునిచ్చారు.
అలాగే, రాబోయే వారం “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అమలు చేస్తామని, ఒకే నెలలో రెండు పథకాలను కార్యరూపం దుస్తున్నామని తెలిపారు. సంక్షేమం, సమగ్ర అభివృద్ధే తమ ప్రాధాన్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.