Chandrababu: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు చర్య తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీ పెరుగుదల, ఆర్థిక రంగాల అభివృద్ధి కోసం అనేక మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు. విశాఖలో నిర్వహించిన నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్‌టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా నియంత్రణపై చర్చించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తన గత పిలుపునకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు.
భారత్ ఐటి రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోంది అని, మోదీ యొక్క విజన్ ప్రేరణగా పేర్కొన్నారు.పేదరిక నిర్మూలన ప్రభుత్వ ధ్యేయంగా ఉందని, ఉపాధి కల్పించే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్‌లో రిఫార్మ్స్ తీసుకువచ్చింది, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధి కోసం ముఖ్యమైన ప్రాజెక్టులను చేపడుతోందని తెలిపారు. కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ కారిడార్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.