Cm chandrababu: జ్యూరిచ్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 20 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరై ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తమ పాత్ర ఎంతో ముఖ్యమని పాల్గొన్న ఎన్నార్టీలకు తెలిపా
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి స్థానం గణనయంగా పెరిగిందని చంద్రబాబు అన్నారు. గతంలో దావోస్ ప్రాంతంలో తెలుగువారిని చూడటం అరుదైతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని పేర్కొన్నారు. 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారని, 148 దేశాల్లో ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశామని వివరించా
ఎన్నార్టీలను పరిశ్రమల రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒక కుటుంబంలో ఒకరు ఉద్యోగం చేస్తూ, మరొకరు వ్యాపారం ప్రారంభించాలనే ‘ఒన్ ఫ్యామిలీ – ఒన్ ఎంటర్‌ప్రెన్యూర్’ విధానాన్ని సూచించారు.
ఏపీ ఇప్పుడు పెట్టుబడుల గమ్యంగా మారిందని చంద్రబాబు చెప్పారు. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, ఏఎం గ్రీన్ వంటి పెద్ద సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయని, ఇవి అమల్లోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని వెల్లడించారు.
భవిష్యత్తు టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. క్వాంటం, ఏఐ, స్పేస్, డ్రోన్ టెక్నాలజీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయం, వైద్యం తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని వేగవంతం చేస్తామని వ్యాఖ్యానించారు.
విదేశాల్లో చదువులపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు పెద్ద భరోసా ఇచ్చారు. అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీతో 4 శాతం వడ్డీకే రుణాలు అందజేస్తామని ప్రకటించారు. తిరుపతిలో IIT- IISER భాగస్వామ్యంతో ఆధునిక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సంక్రాంతి పోటీల విజేతలను సత్కరించారు. ఎన్నార్టీలు ఎన్నికల్లో అందించిన మద్దతుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలకు విచ్చేయాలని ఆహ్వానించారు.
