Tamil Nadu: తమిళనాడులోని రాణిపేట్‌లో డిసెంబర్ 10వ తేదీ మంగళవారం నాడు 9వ తరగతి విద్యార్థి క్లాస్ జారుతున్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. చెన్నై-బెంగళూరు హైవేలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.ఉదయం 11:30 గంటలకు జరిగినట్లు సమాచారం.
మృతురాలిని అద్విత (14)గా గుర్తించారు. బాలిక క్లాస్ జారుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే మేల్విశారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు విచారణలో తేలింది.
ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం?
Tamil Nadu: ఆమె తండ్రి డాక్టర్ కె వసంతకుమార్ వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగానికి హెడ్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం కావేరిపాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఇండియా టుడే పేర్కొంది.
ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది
కుప్పకూలడానికి ముందు అద్విత క్లాస్‌మేట్ భుజంపై కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీ వెల్లడించింది. అద్విత స్పృహ తప్పి పడిపోయిందని అర్థం చేసుకున్న తర్వాత భయాందోళనకు గురైన క్లాస్‌మేట్ తన టీచర్ కోసం అరిచింది వెంటనే టీచర్ వచ్చారు.
A 14-year-old school student from Tamil Nadu suffered a heart stroke and is no more. 🙏 pic.twitter.com/MXw3K03bx4
— Indian Tech & Infra (@IndianTechGuide) December 13, 2024