Mahbubnagar: కొంచమే భూమి..గొడవ మాత్రం చాలా పెద్దది. ఇంతకీ ..ఇంత రవ్వ భూమి కోసం ఎందుకు అంత రచ్చ ? అందులోను దాయాదుల మధ్యే . కొట్టుకోవడం అంటే మాములుగా కాదు..మన వల్లే కదా అని మరిచిపోయి..చితకబాదారు. అలా కొట్టుకోవడానికి ఎందుకు అంత కారణం ? ఆ కొంత భూమి ఏదైనా కోట్లు విలువ చేస్తుందా ? అంటే అది కూడా కానీ కాదు., అసలు కారణం వేరే ఉంది ..అదేంటో లెట్స్ సి …
మహబూబ్‌నగర్ జిల్లా రాజోలిలో భూతగాదాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాయాదుల దాడిలో నాలుగు రోజుల క్రితం దంపతులకు తీవ్ర గాయాలు కాగా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.రాజోలికి చెందిన తుంగని నరేష్, బురాన్‌ల మధ్య 34 గుంటల భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది.
ఇప్పటికే ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించగా స్థలం విషయంలో స్టే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఇరువర్గాలు పొలం వద్ద గొడ్డవ పడ్డారు. ఈ దాడిలో నరేష్,అతడి భార్య అరుణను దాయాదులు చితకబాదారు.దీంతో తీవ్రగాయాలు కాగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయంపై ఎస్‌ఐ నాగన్నను వివరణ కొరగా దంపతులపై దాడికి పాల్పడిన బూరన్, అతని కుమారులు నరేష్, ఆంజనేయులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.