Kantara Chapter 1

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ విడుదలపై క్లారిటీ!

Kantara Chapter 1: కన్నడ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘కాంతార’ ఒకటి. భక్తి రసంతో పాటు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ఈ సినిమాకు నటుడు రిషభ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ భారీ విజయానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార 2’ని రూపొందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, రిలీజ్ డేట్‌పై పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి.

మేకర్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని లాక్ చేశారు. కానీ, ఈ తేదీలో సినిమా రాదని కొన్ని రూమర్స్ హల్‌చల్ చేశాయి. దీనిపై స్పందించిన చిత్ర బృందం, ఆ పుకార్లకు చెక్ పెడుతూ సినిమా అనుకున్న సమయానికే విడుదలవుతుందని స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రీక్వెల్‌పై క్లారిటీ వచ్చినట్టైంది.

Also Read: Pushpa 3: పుష్ప 3: విలన్ ఎవరో క్లారిటీ ఇచ్చేసిన సుక్కు!

Kantara Chapter 1: ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా కన్నడ సినిమా స్థాయిని మరోసారి చాటనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘కాంతార 2’తో మరోసారి బాక్సాఫీస్ దద్దరిల్లేనా? అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jailer: జపాన్ లో విడుదలకు రెడీ అవుతున్న జైలర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *