Kantara Chapter 1

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్‌ 1’ రిలీజ్‌పై స్పష్టత.. సోషల్‌ మీడియా రూమర్స్‌కు చిత్రబృందం చెక్!

Kantara Chapter 1: 2022లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ‘కాంతార’ సినిమా, రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో, తానే హీరోగా నటించగా, సప్తమి గౌడ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్‌ 1’ తెరకెక్కుతోంది.

షూటింగ్‌ శరవేగంగా సాగుతున్నప్పటికీ, సినిమా వాయిదా పడిందంటూ సోషల్‌ మీడియాలో ఊహాగానాలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం స్పందిస్తూ, అక్టోబర్‌ 2న సినిమా థియేటర్లలో రిలీజ్‌ అవుతుందని స్పష్టం చేసింది. “షెడ్యూల్స్‌ ప్రకారం షూటింగ్‌ జరుగుతోంది. ఫేక్‌ న్యూస్‌ను నమ్మవద్దు. అభిమానులు మమ్మల్ని నమ్మండి, ఈ వెయిటింగ్‌ విలువైనది అవుతుంది,” అని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

Also Read: Kiran Abbavaram: తండ్రైన కిరణ్‌ అబ్బవరం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్‌ 1’ కథ, మొదటి భాగానికి ముందు జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. పంజుర్లి సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి. అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్‌ కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bank Deposit: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. కేంద్రం రూ.5 లక్షల పరిమితి పెంచనుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *