దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో సతమతం అవుతుంది. రోజురోజుకు గాలి నాణ్యత తగ్గిపోతుంది. ఇదే విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ, పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్‌లకు వెళ్లడం మానేసినట్లు చెప్పారు.
“ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా పడిపోయినందున ఉదయాన్నే బయటకు వెళ్లకపోవడం మంచిదని తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ఓ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.ఈ రోజు నుండి నేను మార్నింగ్ వాక్‌లకు వెళ్లడం మానేశాను. సాధారణంగా నేను ఉదయం 4 నుండి 4.15 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్తాను” అని ఆయన చెప్పారు.ఇంట్లోనే ఉండడం ద్వారా శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్యుడు చెప్పినట్లు సీజేఐ వెల్లడించారు.